ఈ ఏడాది రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య
ప్రహాసనంగా మారింది. అన్నీ కాలేజీలకు ఒకే ఫీజు విధానం ఉండాలని ప్రయివేటు
కాలేజీలు మొరాయిస్తున్నాయి. కొన్ని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ వత్తిడి
మేరకు 35 వేల రూపాయలకు ఆమోదించినప్పటికీ మరికొన్ని కాలేజీలకు 50,200
రూపాయలు కోర్టు ఉత్తర్యుల ద్వారా పొందటంతో మరికొన్ని కళాశాలల ఫీజు ఎఐఆర్‌సి
ద్వారా వెలువడనున్న నేపద్యంలో ఇంజనీరింగ్ కాలేజీల సమస్య మళ్లీ సమస్య
మొదటి కొచ్చింది. ఇప్పటికే ఆలస్య మయ్యిందని, రీఎంబర్స్‌మెంట్ ప్రభుత్వమే
భరించాలని విద్యార్ధిసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం
ఫీజును ఖరారు చేయకుండానే కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించింది. రాష్ట్రంలో
ఎమ్‌సెట్ ద్వారా ఇంజనీరింగ్‌లో చేరాల్సిన విద్యార్ధులకు భవిష్యత్
అంధకారంగా మారింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో అడ్మిషన్లు పూర్తైపోయి
నెలరోజులయ్యింది. రెగ్యులర్ గా క్లాసులుకూడా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో
మాత్రం ఇప్పటిదాకా కౌన్సిలింగ్ కే దిక్కులేదు. తీరా కౌన్సిలింగ్ తేదీల్ని
ప్రకటించాక, కాలేజీ యాజమాన్యాలు.. ఫీజులు అందరికీ సమానంగా ఉండాలంటూ కొత్త
ఆందోళన మొదలుపెట్టాయి. ఫీజలు
పెంచకపోతే కాలేజీలు నడపలేమని యాజమాన్యాలు, పెంచితే బిసిలకు
రిఎంబర్స్‌మెంట్ ఇవ్వటం కష్టమని ప్రభుత్వం గట్టిగా పట్టుపడుతున్నాయి.
విద్యార్థులకు మాత్రం పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment