మాయా... మాయా... అంతా మాయ... ఆధునికత
మనిషికి ఎంత సౌలభ్యాన్ని ఇస్తుందో.. అంతకంటే ఎక్కువగా ప్రమాదానికి
కారణమవుతోంది. మార్కెట్‌ల్లోకి ఒక వస్తువు వచ్చిన మరుక్షణంలోనే అటువంటి
వస్తువే.. క్లోనింగ్ రూపంలో మార్కెట్‌లోకి విడుదలవుతుంది. మంచి`చెడులు
ఎంచుకునే సమయం వచ్చేసరికి ఎంతోమంది నష్టపోతుంటారు. ... ఎటిఎంలను ఇప్పుడు
ప్రతి బ్యాంకు ఇస్తోంది. వాటికి మంచి భద్రత కూడా ఉంది. అయితే.. కాదేదీ
క్లోనింగ్‌కు అనర్హం... అన్న రీతిలో ఎటిఎం కార్డులను క్లోనింగ్ చేయడం
ద్వారా కొందరు డబ్బులను డ్రా చేయడంతో బ్యాంకుల్లో వున్న తమ డబ్బు పోయి
ఎంతోమంది బాధితులు విలవిలలాడిపోతున్నారు. గతంలో ఢల్లీ, బీహార్ రాజధాని
పాట్నాలలో ఇలా విత్ డ్రా అయ్యాయి. కొత్తగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఈ
సంఘటన జరిగింది. అయితే ఇటువంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి. నేడు ప్రతి
సంస్థ జీతాలు బ్యాంకుల నుండే ఇస్తున్నాయి. అందుచేత ఇకనుంచి ఇటువంటి వాటిపై
మరింత భద్రతను ఆయా బ్యాంకులు తీసుకోవలసి ఉంది. లేదంటే ఎటిఎం కార్డుల
క్లోనింగ్ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలు వింటూ
వుంటే సాంకేతికంగా మనిషి సాధించిన ప్రగతి పురోగమనానికి దారితీస్తోందా...
తిరోగమనానికా...! అన్న ప్రశ్న తలెత్తుతోంది.
No comments:
Post a Comment